వేసవి ప్రారంభం కాగానే AC అవసరం ఎక్కువగా అనిపిస్తుంది.

కానీ కొన్నిసార్లు AC మునుపటిలా చల్లదనాన్ని ఇవ్వడం మానేస్తుంది.

ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ACలో గ్యాస్ అయిపోయిందని భావిస్తారు.

ఏసీలో గ్యాస్ నింపడానికి ఎంత ఖర్చువుతుందనేది చాలా మందికి సందేహం

ఏసీ రకాలు, వాడే గ్యాస్ , సర్వీస్ సెంటర్ ఫీజులు కలిపి కాస్త ఎక్కువే అవుతుంది.

గ్యాస్ నింపాలని అనుకుంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి

విండో ACలలో గ్యాస్ నింపడానికి అయ్యే ఖర్చు సాధారణంగా ₹1,500 నుండి ₹3,000 వరకు ఉంటుంది.

స్ప్లిట్ ఏసీ కోసం ఈ ధర ₹2,500 నుండి ₹5,000 వరకు ఉండవచ్చు.

ఈ ఖర్చు నగరం, సర్వీస్ ప్రొవైడర్ , AC సామర్థ్యం ఆధారంగా మారవచ్చు.

కేవలం గ్యాస్ రీఫిల్లింగ్ సరిపోదు. మొదట లీక్ అవుతుందో లేదో పూర్తిగా తనిఖీ చేయాలి.

గ్యాస్ లీక్ ను రిపేర్ చేయకుండా రీఫిల్ చేస్తే సమస్య కొన్ని రోజుల్లో మళ్లీ రావచ్చు