మీరు జంక్ ఫుడ్ ప్రియులా? అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే.
బర్గర్ ఆరోగ్యరకరమైన ఆహారంలో భాగం కావచ్చని పరిశోధకులు అంటున్నారు. ఇది బర్గర్ ప్రియులకి ఒక రకంగా శుభవార్తే.
మునుపటి అధ్యయనాలు ప్రాసెస్ చేసిన మాంసం, బేకన్, సాసేజ్, సలామీ వంటివి తినడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ తో ముడి పడి ఉన్నాయని వెల్లడించాయి.
తాజా పరిశోధన మాత్రం రెడ్ మీట్, పూర్తి కొవ్వు పాల ఉత్పత్తులు ఆరోగ్యంపై ఎటువంటి హానికరమైన ప్రభావాన్ని చూపవని సూచిస్తున్నాయి.
రోజుకి 85 గ్రాముల రెడ్ మీట్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని చేయదని తాజా అధ్యయనం వెల్లడిస్తోంది.
అయితే ఇది తప్పనిసరిగా స్టీక్, చాప్స్ లేదా తాజా బర్గర్ లను తయారు చేయడానికి ఉపయోగించే గొడ్డు మాంసం మాత్రం ప్రాసెస్ చేయనిది అయి ఉండాలి.
కొద్ది మొత్తంలో మాంసాన్ని ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యకరమేనని మెక్ మాస్టర్ యూనివర్సిటీ కి చెందిన డాక్టర్ ఆండ్రూ మెంటే చెప్పుకొచ్చారు.
రెండు సేర్విన్గ్స్ పూర్తి కొవ్వు పాలతో చేసిన బటర్, పాలు, పెరుగు వంటివి తీసుకుంటే కొన్ని రకాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
ఆరోగ్యం కదా అని తెగ లాగించేస్తారు ఏమో.. జాగ్రత్త ఊబకాయం కూడా వచ్చేస్తుంది.