5జీని కూడా కొందరు మోసగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.

మీ ఫోన్‌లో 5జీని ఎనేబుల్ చేస్తామంటూ మెసేజ్ చేసి వినియోగదారుల ఫోన్ హ్యాక్ చేస్తున్నారు.

5జీ విషయంలో మీరు ఈ విషయాలు తెలుసుకుంటే మోసాల బారిన పడకుండా ఉండచ్చు.

ఎస్ఎంఎస్, వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా 5జీని యాక్టివేట్ చేయలేరు.

మీ ఫోన్ యాక్సెస్ ఇవ్వడం ద్వారా కూడా 5జీ యాక్టివేట్ చేయడం కుదరదు.

ఎయిర్‌టెల్, జియో 5జీని అందించని నగరాల్లో 5జీ పొందలేరు.

మీది 4జీ ఫోన్ అయితే అందులో 5జీ ఎనేబుల్ కాదు.

కేవలం ఓటీఏ అప్‌డేట్ ద్వారా మాత్రమే 5జీ యాక్టివేట్ అవుతుంది.

మీకు 5జీ ఫోన్ ఉంటే ప్రస్తుతం వాడాల్సిన సిమ్ మార్చాల్సిన అవసరం లేదు.

ప్రస్తుతం ఉన్న టెలికాం ప్లాన్ ద్వారానే 5జీని కూడా ఎంజాయ్ చేయవచ్చు.