ఐఫోన్లకు 5జీ అప్‌డేట్ డిసెంబర్‌లో రానున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ఐఫోన్ యూజర్లకు అత్యుత్తమ 5జీ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి టెలికాం కంపెనీలతో పని చేస్తున్నట్లు తెలిపింది.

యాపిల్ ఫోన్లకు అప్‌డేట్ ద్వారా 5జీ సపోర్ట్ రానుంది.

ఐఫోన్ 14, 13, 12, ఎస్ఈ మోడల్స్ 5జీని సపోర్ట్ చేయనున్నాయి.

శాంసంగ్ ఫోన్లకు 5జీ అప్‌డేట్ నవంబర్ నెల మధ్య నాటికి రానుంది.

ఓటీఏ అప్‌డేట్ ద్వారా శాంసంగ్ ఫోన్లలో 5జీని ఎనేబుల్ చేసుకోవచ్చు.

గూగుల్ ఫోన్లలో పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో, పిక్సెల్ 6ఏ 5జీని సపోర్ట్ చేయనున్నాయి.

వీటికి వీలైనంత త్వరగా 5జీ అప్‌డేట్ ఇస్తామని గూగుల్ తెలిపింది.

షావోమీ డివైస్‌లన్నీ దీపావళి నాటికి 5జీ అప్‌డేట్‌ను పొందనున్నాయి.

ప్రస్తుతం అన్ని స్మార్ట్ ఫోన్ బ్రాండ్లలో కలిపి 128 5జీ ఫోన్లు ఉన్నాయి.