ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనదేశంలో 5జీని ప్రారంభించారు. అక్టోబర్ 24వ తేదీ నుంచి జియో 5జీ ప్రారంభం కానుంది. ఎయిర్‌టెల్ 5జీ ఇప్పటికే కొన్ని నగరాల్లో ప్రారంభం అయింది. ప్రస్తుతానికి 5జీ సర్వీసుల టారిఫ్ రేట్లను ఇంకా ప్రకటించలేదు. 4జీ ద్వారా గరిష్టంగా సెకనుకు 100 ఎంబీ వరకు మాత్రమే డేటా స్పీడ్ ఉండనుంది. 5జీ ద్వారా సెకనుకు 10 జీబీ వరకు ఇంటర్నెట్ స్పీడ్ రానుంది. ప్రత్యేకంగా 5జీ సిమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జియో 5జీ సర్వీసులు 2023 డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. 2024 మార్చి నాటికి ఎయిర్ టెల్ 5జీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. అత్యంత చవకైన జియో 5జీ ఫోన్ త్వరలో మార్కెట్లోకి రానుంది.