యాప్స్‌కు పర్మిషన్ ఇచ్చేటప్పుడు ‘ఫొటోస్, వీడియోస్’, ‘మ్యూజిక్, ఆడియో’కు ప్రత్యేకంగా అనుమతులు ఇవ్వవచ్చు.



క్లిప్ బోర్డ్ హిస్టరీని డిలీట్ చేయవచ్చు. దీని వల్ల మీరు కాపీ చేసిన సమాచారం దుర్వినియోగం కాదు.



సెక్యూరిటీ, ప్రైవసీని మరింత పటిష్టం చేశారు.



ఆపరేటింగ్ సిస్టం మరింత స్టైలిష్‌గా మారింది.



యాప్ ఐకాన్స్‌కు నచ్చిన థీమ్ పెట్టుకునేలా ‘థీమ్డ్ ఐకాన్స్’ అనే ఫీచర్ తీసుకురానున్నారు.



వేర్వేరు యాప్స్‌ను వివిధ భాషల్లో ఉపయోగించుకోవచ్చు.



ఇక నోటిఫికేషన్లకు కూడా ప్రత్యేకంగా పర్మిషన్లు ఇవ్వాల్సిందే.



యాప్స్‌తో సమాచారం షేర్ చేసుకోవడంలో మరింత నియంత్రణ ఉంటుంది.



ఆండ్రాయిడ్ 13తో ఎక్కువ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్లు అందించనున్నారు.

మీడియా కంట్రోల్స్‌ను ఈ అప్‌డేట్ ద్వారా కూడా పూర్తిగా రీడిజైన్ చేశారు.