రిలయన్స్ జియో 5జీ బీటా ట్రయల్స్ నాలుగు నగరాల్లో ప్రారంభం అయింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాశిల్లోని జియో యూజర్లు 5జీని ఎక్స్‌పీరియన్స్ చేయవచ్చు. కంపెనీ పంపించే 5జీ ఇన్విటేషన్ ద్వారా ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఇన్విటేషన్‌ను కంపెనీ ఎస్ఎంఎస్ ద్వారా పంపించనుంది. అన్‌లిమిటెడ్ 5జీ డేటాను వినియోగదారులు 1 జీబీపీఎస్ వేగంతో ఎంజాయ్ చేయవచ్చు. జియో 5జీ సర్వీసుల కోసం ప్రత్యేకమైన సిమ్ అవసరం లేదు. ప్రస్తుతానికి 5జీ కోసం ప్రత్యేకంగా టారిఫ్‌లు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. బీటా ట్రయల్స్‌లో ఉన్నవారు జియో 5జీ సర్వీసుకు ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్ అవుతారు. జియో 5జీ ఉపయోగించాలంటే 5జీ ఫోన్ తప్పనిసరి. జియో 5జీ సర్వీసుకు జియో ట్రూ 5జీ అని పేరు పెట్టారు.