ఈ లక్షణాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే నరకమే... జీవితంలో ముఖ్యమైన ఘట్టం పెళ్లి. జీవితభాగస్వామిని ఎంచుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఈ ఆరు లక్షణాలు ఉన్నవారిని మాత్రం జీవిత భాగస్వామిగా చేసుకోవద్దని చెబుతున్నారు మనస్తత్వశాస్త్రవేత్తలు. ఒకసారి రెండోసార్లో కాదు తరచూ వీళ్లు ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకోరు. ప్రామిస్ బ్రేకర్ల వల్ల రోజూ ఇంట్లో ఏదో ఒక గొడవ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది తిను, ఈ డ్రెస్ వేసుకో, ఇలాగే నడువు, ఇక్కడ నిల్చో... ప్రతి విషయంలోనూ పక్కవాళ్లను కంట్రోల్ చేసే లక్షణాలున్న వ్యక్తి కూడా మంచి జీవితభాగస్వామి కాలేడు. ఇవ్వడం, తీసుకోవడం, పంచుకోవడం... అన్నీ ఇద్దరి మనుషుల మధ్య సమానంగా ఉండాలి. తీసుకోవడమే కానీ ఇవ్వడం అలవాటు లేని వ్యక్తితో కష్టాలు పడాల్సి ఉంటుంది. తప్పు చేయడం సారీ చెప్పడం, మళ్లీ అదే తప్పు రిపీట్ చేయడం, సారీ చెప్పి తప్పించుకోవడం... ఈ అలవాటున్న వ్యక్తులు కూడా మంచి లైప్ పార్ట్నర్ కాలేరు. నేను, నాది, నేను చెప్పినట్టు వినాలి, నువ్వు నాకు చెప్పేదేంటి... ఇలా అహంకారం చూపించే వ్యక్తికి దూరంగా ఉండడం మంచిది. అబద్ధాలు చెప్పే వ్యక్తిని ఎప్పుడూ మీ జీవితంలోకి ఆహ్వానించకండి. అది కూడా ఒక మానసికరోగ లక్షణమే.