డయాబెటిస్‌తో పోరాడిన సెలెబ్రిటీస్ వీళ్లే డయాబెటిస్ ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఒక్కోసారి ఒంట్లో చేరిందా మళ్లీ బయటికి పోదు. కేవలం నియంత్రణలో మాత్రం ఉంచగలం. వారసత్వం, ఊబకాయం... ఇలా డయాబెటిస్ రావడానికి చాలా కారణాలు ఉండొచ్చు. డయాబెటిస్ బారిన పడిన సెలెబ్రిటీలు వీరంతా. సమంతకు డయాబెటిస్ ఉన్నట్టు 2013లో తెలిసింది. అప్పుడామె వయసు కేవలం 26 ఏళ్లు. ఆరోగ్యకరమైన జీవనశైలితో ఆమె డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచింది. ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ కూడా డయాబెటిస్ బాధితుడే. ఆయనకు టైప్ 1 మధుమేహం ఉంది. ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్‌కు పదిహేడేళ్ల వయసులో మధుమేహం ఉన్నట్టు తెలిసింది. కమల్ హాసన్‌కు టైప్ 1 డయాబెటిస్ ఉంది. మయూరిగా మనకు చాలా ఏళ్ల క్రితమే పరిచయమైన సుధా చంద్రన్ కూడా డయాబెటిక్. సెలెబ్రీటీలంతా డయాబెటిస్ ఉన్నప్పటికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ, తీపి పదార్థాలకు దూరంగా ఉంటూ మధుమేహాన్ని నియంత్రణలో ఉంచారు.