వెంకటేశ్‌ అయ్యర్‌

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అయ్యర్‌ ధరను రూ.20 లక్షల నుంచి రూ.8 కోట్లకు పెంచింది.

మయాంక్‌ అగర్వాల్‌

కేఎల్‌ రాహుల్‌ లేకపోవడంతో మయాంక్‌కు వేతనం రూ.కోటి నుంచి రూ.12 కోట్లకు చేరుకుంది.

సంజు శాంసన్‌

రాజస్థాన్‌ రాయల్స్‌ సారథి సంజు శాంసన్‌ వేతనం రూ.8 కోట్ల నుంచి రూ.14 కోట్లకు చేరుకుంది.

రుతురాజ్‌ గైక్వాడ్‌

ఈ ఓపెనర్‌ స్థాయికి తగ్గ ధర దక్కించుకున్నాడు. కనీస ధర నుంచి రూ.6 కోట్లకు చేరుకున్నాడు.

అర్షదీప్‌ సింగ్‌

ఈ పంజాబ్‌ యువ పేసర్‌ ధర రూ.20 లక్షల నుంచి రూ.4 కోట్లకు పెరిగింది.

యశస్వీ జైశ్వాల్‌

రాజస్థాన్‌ జైశ్వాల్‌పై నమ్మకం ఉంచింది. రూ.4 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది.

ఉమ్రాన్‌ మాలిక్‌

చురకత్తుల్లాంటి బంతులు వేసే ఈ జమ్ముకశ్మీర్‌ ఆటగాడి ధర రూ.10 లక్షల నుంచి రూ.4 కోట్లకు పెరిగింది.

అబ్దుల్‌ సమద్‌

ఆ ఆల్‌రౌండర్‌ ధర రూ.20 లక్షల నుంచి రూ.4 కోట్లకు చేరుకుంది.

పృథ్వీ షా

దిల్లీ ఈ ఓపెనర్‌ ధరను రూ.1.2 కోట్ల నుంచి రూ.7.50 కోట్లకు పెంచింది.

వరుణ్‌ చక్రవర్తి

ఈ మిస్టరీ ధర వేతనం రూ.4 కోట్ల నుంచి రూ.8 కోట్లకు పెరిగింది.

సూర్యకుమార్‌ యాదవ్‌

ముంబయి ఈ 360 డిగ్రీ ఆటగాడి ధర 3.2 కోట్ల నుంచి రూ.8 కోట్లకు పెంచారు.

మహ్మద్‌ సిరాజ్‌

బెంగళూరు సిరాజ్‌పై నమ్మకం ఉంచింది. రూ.2.6 కోట్ల నుంచి రూ.7 కోట్లకు పెంచింది.

అక్షర్‌ పటేల్‌

తన ఆటతీరును మెరుగుపర్చుకున్న అక్షర్‌ ధర రూ.9 కోట్లకు చేరుకుంది.