అఖండ విడుదల... బాలయ్య ఫ్యాన్స్‌కు పూనకాలు



అఘోరాగా అఖండలో ఉగ్రరూపం చూపించారు బాలయ్య.



బోయపాటితో బాలయ్య తోడైతే ఆ కాంబినేషన్ అదిరిపోతుంది.



ప్రపంచవ్యాప్తంగా అఖండ మూవీ గ్రాండ్‌గా విడుదలైంది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ థియేటర్ల ముందు రచ్చ రచ్చ చేశారు.



సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు నుంచే ‘జై బాలయ్య’మానియా మొదలైపోయింది. డల్లాస్ లో బాలయ్య ఫ్యాన్స్ కార్లపై పోస్టర్లతో ర్యాలీగా థియేటర్ కు వచ్చారు.



అమెరికాలోని థియేటర్ ముందు కార్లతో పార్కింగ్ నిండిపోయింది.



తమన్ బీజీఎం అదిరిపోయింది. దీంతో అమెరికాలోని థియేటర్ ముందు ఇలా బోర్డు పెట్టుకోవాల్సి వచ్చింది.



ఆస్ట్రేలియాలో కూడా బాలయ్య ఫ్యాన్స్ సినిమా విడుదల సందర్భంగా ‘ఎన్‌బికే’అని ఆంగ్ల అక్షరాల రూపంలోని కేకును కట్ చేశారు.



(Video credit: VamsiShekar/Twitter)



అమెరికాలో ఓ థియేటర్ ముందు అభిమానులు కొబ్బరి కాయలు కొట్టి మరీ సినిమాను చూడటానికి వెళ్లారు.