గుడ్లు ఎక్కువ రోజుల పాటు ఫ్రిజ్ లో ఉంచి వాడుకోకూడదు. అవి కూడా చెడిపోతాయి.
వాటి 3-5 వారాల షెల్ఫ్ జీవితాన్ని కలిగి ఉంటాయి. 40 డిగ్రీలు లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద స్టోర్ చెయ్యాలి.


పాలు, డైరీ ఉత్పత్తుల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. పుల్లని వాసన, రంగు మారిన పెరుగు తినకూడదు.
3 రోజుల తర్వాత పాశ్చరైజ్ చేయని పాలు ఉపయోగించకూడదు. బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది.


వంటనూనెల గడువు ఏడాది ఉంటుంది. గడువు తేదీ దాటిన తర్వాత వాడితే కూరల రుచి చెడుగా ఉంటుంది.



క్యాబేజీ ఫ్రిజ్ లో ఐదు రోజులు ఉంటుంది. అది సన్నగా వడబడిపోయినట్టు ఉంటే వెంటనే పారేయాలి.



మయోన్నైస్ ఆరు నెలల వరకు మాత్రమే బాగుంటుంది. ఒకసారి దాన్ని ఉపయోగించిన తర్వాత రెండు నెలలకి మించి వాడకూడదు.



కెచప్ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఒకసారి తెరిస్తే ఆరు నెలల కంటే ఎక్కువ వాడకూడదు.



మొలకెత్తిన గింజలు ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే. తినడానికి ముందు వాటిని ఉడికించుకోవడం సురక్షితం.



స్టోర్ లో విక్రయించే మాంసంలో ఎక్కువ భాగం ఇ కోలి, సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది.
తాజాగా ఉన్న మాంసం మాత్రమే తినాలి, నిల్వ చేసింది తింటే రోగాల బారిన పడతారు.