‘డిజే టిల్లు’ మనసు దోచిన రాధికా గుర్తుందా? అదేనండి నేహా శెట్టి. తాజాగా బుల్లెట్ బండిపై కూర్చొని హొయలొలికిస్తున్న ఫొటోలు పోస్ట్ చేసింది. ‘డిజే టిల్లు’తో నేహా శెట్టి కెరీర్‌నే మార్చేసింది. ఇప్పుడు ‘రాధికా’కు అవకాశాలు క్యూకడుతున్నాయి. ‘డీజే టిల్లు’ కంటే ముందు నేహా రెండు సినిమాలు చేశారు. అవి హిట్ కాలేదు. అమ్మాయి అందంగా ఉంటుందని, చక్కగా నటిస్తుందని పేరొచ్చినా అవకాశాలు రాలేదు. ఇటీవలే నేహా హీరో కార్తికేయ గుమ్మకొండతో ఒక సినిమాకు సైన్ చేసింది. ఆ వెంటనే కిరణ్ అబ్బవరంతో నటించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆ చిత్రానికి ‘రూల్స్ రంజన్’ అని పేరు పెట్టారు. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్. Image Credits: Neha Shetty/Instagram