మంచు విష్ణు ఇప్పుడు ‘జిన్నా’ షూటింగులో బిజీగా ఉన్నారు. ‘జిన్నా’లో విష్ణు గాలి నాగేశ్వరరావు’ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సన్నీలియోన్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఇందులోని ఓ సాంగ్ చిత్రీకరణ వీడియోను విష్ణు ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఆ పాట కోసం డ్యాన్సర్లు 25 అడుగుల ఎత్తువరకు ఒకరిపై ఒకరు పిరమిడ్‌లా నిలుచున్నారు. ఆ 25 అడుగుల హ్యూమన్ పిరమిడ్‌పై విష్ణు ధైర్యంగా నిలుచున్నారు. అలా నిలుచోడానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమా కోసం విష్ణు చాలా శ్రమిస్తున్నారు. సినిమా విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. విష్ణుకు జంటగా ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ కూడా నటిస్తున్నారు. Image Credit: Manchu Vishunu/Instagram