ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే అనే సంగతి తెలిసిందే. ఈసారి ఆయన హైదరాబాద్‌కు దూరంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా టైంపాస్ చేశారు. ఫ్యామిలీతో సరదా క్షణాల ఫొటోలను చిరు ఆ రోజే పంచుకున్నారు. అయితే, వీడియో మాత్రం కాస్త లేటుగా పోస్ట్ చేశారు. లేటైనా లేటస్టుగా రావడం ‘మెగా’ ట్రెండ్. అందుకే, ఈ వీడియో కూడా ట్రెండవ్వుతోంది. చిరంజీవి వరుస చిత్రాలతో బిజీగా గడిపేస్తున్నారు. ఆయన నటిస్తున్న ‘భోళా శంకర్’, ‘గాడ్ ఫాదర్’ రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ‘గాడ్ ఫాదర్’లో అదిరిపోయే లుక్‌తో చిరు అలరించారు. Images and Videos Credit: Chiranjeevi/Instagram