నయనతార నాయికగా ఆమె భర్త విఘ్నేష్ శివన్ నిర్మించిన సినిమా 'కనెక్ట్'. ఇది ఎలా ఉందంటే? కథ : జోసెఫ్ బెనాయ్ (వినయ్ రాయ్), సుసాన్ (నయనతార) దంపతుల అమ్మాయి పేరు అనా (హానియా నఫీసా). జోసెఫ్ డాక్టర్. కోవిడ్ డ్యూటీలో వైరస్ బారిన పడి మరణిస్తాడు. తండ్రి ఆత్మతో మాట్లాడాలని అనా ట్రై చేస్తుంది. వుయ్ జా బోర్డుతో అనా చేసిన ప్రయత్నం వికటించి ఆమెకు దెయ్యం పడుతుంది. అది తల్లికి ఎప్పుడు తెలిసింది? అనాకు పట్టిన దెయ్యాన్ని వదిలించడానికి సుసాన్, ఆమె తండ్రి ఆర్థర్ (సత్యరాజ్), ఫాదర్ అగస్టీన్ (అనుపమ్ ఖేర్) ఏం చేశారు? సినిమా ఎలా ఉంది? : దర్శకుడు అశ్విన్ శరవణన్ చిన్న పాయింట్ తీసుకుని రెగ్యులర్ ఫార్మటులో సినిమా తీశారు. 'కనెక్ట్'లో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే కథ లేదు. అసలు, దెయ్యం ఎందుకు పట్టింది? అనేదానికి క్లారిటీ లేదు. హారర్ థ్రిల్లర్ కథల్లో ఆర్టిస్టులకు పెద్దగా నటించే స్కోప్ ఉండదు. ఈ సినిమాలో కూడా అంతే! క్యారెక్టర్‌కు తగ్గట్టు నయనతార నటించారు. సత్యరాజ్ నటన, డైలాగులు మరీ ఓల్డ్‌గా ఉన్నాయి. హనియా నఫీసా, అనుపమ్ ఖేర్ తమ నటనతో ఇంపాక్ట్ చూపించారు. ఇద్దరూ నటనతో మెప్పించారు. రొటీన్ స్టోరీ, సీన్స్ అయినప్పటికీ సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం వల్ల కొన్ని సీన్స్ ప్రేక్షకులను భయపెడతాయి. నయనతార డై హార్డ్ ఫ్యాన్స్, మినిమమ్ థ్రిల్స్ ఉన్నాసరే ఎంజాయ్ చేసేవాళ్ళు... 'కనెక్ట్'కు కనెక్ట్ కావచ్చు. చూస్తే థియేటర్లలో చూడాల్సిన చిత్రమిది. అదీ సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం!