ఇన్ స్టాలోకి నయనతార- కొడుకులతో కలిసి సైలిష్ లుక్ తో ఎంట్రీ

అందాల తార నయనతార ఇన్ స్టా గ్రామ్ లోకి అడుగు పెట్టింది.

తన కొడుకులతో కలిసి తొలి స్టైలిష్ వీడియోను షేర్ చేసింది.

అద్భుత సినిమాల్లో నటించి సౌత్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది నయనతార.

లక్షలాది మంది అభిమానులు ఉన్నా, ఆమె ఇప్పటి వరకు ఇన్ స్టా అకౌంట్ ఓపెన్ చేయలేదు.

తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని భర్త విఘ్నేష్ ఇన్ స్టా ద్వారానే షేర్ చేస్తుంది.

తాజాగా ఆమె ఇన్ స్టాలో అకౌంట్ ఓపెన్ చేసి, తొలి వీడియోను అభిమానులతో పంచుకుంది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

తమ అభిమాన నటి ఇన్ స్టాలోకి రావడంతో పెద్ద సంఖ్యలో నెటిజన్లు ఫాలో అవుతున్నారు.

అకౌంట్ ఓపెన్ చేసిన కొద్ది గంటల్లోనే లన్నరకు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది నయనతార.

All Photos & Video Credit: N A Y A N T H A R A/Instagram/twitter