నయనతార, విఘ్నేష్ శివన్ ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. జూన్ 9న మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో వీరిద్దరు ఒక్కటయ్యారు. ఆ తర్వాత వేంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కోసం తిరుమలకు వెళ్లారు. తమ పెళ్లి రోజున తమిళనాడులో సుమారు లక్ష మందికి విందు భోజనం పెట్టారు. నయన్-విఘ్నేష్ ప్రస్తుతం హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కొత్త జంట థాయ్‌లాండ్‌లో విహరిస్తున్నారు. బ్యాంకాక్‌లోని ఓ లగ్జరీ హోటల్‌లో ఉంటున్నారు. తాజాగా నయన్-విఘ్నేష్ తమ రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసుకున్నారు. ఈ ఫొటోలు చూసిన అభిమానులు, వామ్మో.. వీరి రొమాన్స్ మామూలుగా లేదంటున్నారు. నయన్-విఘ్నేష్ హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న హోటల్ ఇదే. Credits: Vignesh Shivan/Instagram