కాజల్ అగర్వాల్ ఏప్రిల్ 19న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కాజల్ తన బిడ్డకు నీల్ అని పేరు పెట్టింది. గత కొన్ని రోజులుగా కాజల్ తన బిడ్డను పూర్తిగా చూపించడం లేదు. నీల్ ముఖం కనిపించకుండా ఫొటోలు పోస్ట్ చేస్తోంది కాజల్. దీంతో కాజల్ అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. మీ అబ్బాయిని పూర్తిగా చూపించవచ్చు కదా అని అడుగుతున్నారు. మరి ఫ్యాన్స్ మొర విన్నదో ఏమో, కాజల్ కాస్త కరుణించింది. మూడో నెల బర్త్‌డే వేడుక పురస్కరించుకుని నీల్‌తో ఉన్న ఫొటో పోస్ట్ చేసింది. ఈసారి బిడ్డ ముఖానికి ఏది అడ్డుపెట్టలేదు. సైడ్ ఫేస్ మాత్రమే కనిపించేలా జాగ్రత్తపడింది. బిడ్డకు దిష్టి తగులుతుందనే కాజల్ అలా చేస్తోంది కాబోలని ఫ్యాన్స్ సర్ది చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం కాజల్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు కసరత్తులు చేస్తోంది. Credits: Kajal Aggarwal/Instagram