సింపుల్ చికెన్ రైస్ చేసేయండిలా

చికెన్ రైస్ కోసం చైనీస్ సెంటర్ల చుట్టూ తిరగకుండా ఇంట్లోనే సింపుల్ గా చేసుకోవచ్చు.

అన్నం - ఒకటిన్నర కప్పు
చికెన్ - వందగ్రాములు
ఉల్లిపాయ తరుగు - పావు కప్పు
కారం - అరస్పూను
కొత్తిమీర తరుగు - రెండు స్పూనులు

మిరియాల పొడి - ఒక స్పూను
వెల్లుల్లి రెబ్బలు - నాలుగు
క్యారెట్ - ఒకటి
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - రెండు స్పూనులు
పచ్చి బఠాణీలు - పావు కప్పు

ముందుగా చికెన్‌ను చిన్న ముక్కలుగా చేసుకుని ఉడికించి పెట్టుకోవాలి. కాస్త పసుపు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి.

స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, దంచిన వెల్లుల్లి ముక్కలు వేయించాలి.

ఉల్లిపాయ ముక్కలు వేగాక క్యారెట్ ముక్కలు, పచ్చిబఠాణీలు వేసుకోవాలి.

ఇవి వేగాక చికెన్ ముక్కలు వేసి వేయించాలి.

ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి.

ఇది కాస్త కూరలా దగ్గరగ అయ్యాక అన్నం, కొత్తిమీర వేసి కలుపుకోవాలి.

అయిదు నిమిషాలు తరువాత స్టవ్ కట్టేయాలి. అంతే చికెన్ రైస్ రెడీ.