ఈ వారం ఏకంగా 8 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. నిజానికి 9 సినిమాలు రావాల్సింది కానీ ఒకటి వాయిదా పడింది. కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి నటించిన 'సమ్మతమే' సినిమా జూన్ 24న రిలీజ్ కాబోతుంది. ఆకాష్ పూరి నటించిన 'చోర్ బజార్' మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకొని అదే రోజున వస్తుంది. ఎంఎస్ రాజు రూపొందించిన '7 డేస్ 6 నైట్స్' కూడా జూన్ 24నే రానుంది. వీటితో పాటు సాయిరాం శంకర్ 'ఒక పథకం ప్రకారం' కూడా శుక్రవారమే రానుంది. 'గ్యాంగ్ స్టర్ గంగరాజు' జూన్ 24న విడుదల కానుంది. శ్రీరామ్, అవికా నటించిన 'టెన్త్ క్లాస్ డైరీస్' జూన్ 24న రిలీజ్ కానుంది. 'సదా నన్ను నడిపే' అనే చిన్న సినిమా కూడా ఈ సినిమాలకు పోటీగా రానుంది. రామ్ గోపాల్ వర్మ 'కొండా' సినిమా ఒకరోజు ముందుగా జూన్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' జూన్ 23 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. 'డాక్టర్ స్ట్రేంజ్ 2' డిస్నీప్లస్ హాట్ స్టార్ లో జూన్ 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 'మన్మథ లీల' సినిమా జూన్ 24 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది.