అక్కడ పదిరూపాయలకే ప్లేటు బిర్యానీ



బిర్యానీ కోసం ఎంత దూరమైన వెళ్లే ఆహారప్రియులు ఉన్నారు. వారు ఈ పదిరూపాయల బిర్యానీని కూడా టేస్టు చేయాల్సిందే.



హైదరాబాద్‌లోని అఫ్టల్ గంజ్ బస్టాండ్ ప్రాంతంలో ఉంది ఈ బిర్యానీ బండి. దీని యజమాని ఇఫ్తెకార్.



ఉస్మానియా ఆసుపత్రికి వచ్చే పేదలకు, బేగం బజార్లో పనిచేసే కూలీలకు కూడా ఇదే ఫుడ్ పాయింట్.



ఇఫ్తెకార్ రోజుకు 60 కిలోల బిర్యానీని వండుతారు. దాదాపు నాలుగు పెద్ద కంటైనర్లలో వాటిని తెచ్చిపెడతారు.



ఇది పూర్తిగా వెజ్ బిర్యానీ. మొక్కుబడిగా వండుతాడనుకోకండి ఇందులో క్యారెట్లు, గ్రీన్ పీస్, బంగాళాదుంపలు, బీన్స్ వంటి కూరగాయలు నిండుగా వేసి వండుతాడు.



రోజుకు 1500 ప్లేట్లు ఇక్కడ అమ్ముడవుతాయి.కిలో బిర్యాని రూ.60కి అమ్ముతారు.



పేదలకు సేవచేయాలన్న కోణంలో ఈ బిర్యానీ స్టాల్ ను ప్రారంభించారు.



ఈ బిర్యానీ షాపుకు ‘అక్సా బిర్యాని స్టాల్’ అని పేరు పెట్టారు. ఉదయం పదకొండు గంటల నుంచి ఈ బిర్యానీ అందుబాటులో ఉంటుంది.