దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది నయనతార.



గతంలో ఈ బ్యూటీ కొందరితో ప్రేమాయణం సాగించింది.



కానీ ఏదీ సక్సెస్ కాలేదు. దీంతో కొన్నాళ్లపాటు కెరీర్ పైనే ఫోకస్ పెట్టింది. 



ఆ తరువాత దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది. 



వీరిద్దరికి ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.



త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతుంది.



ఇంతలోనే ఇద్దరూ కలిసి ట్రిప్ లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు. 



వీరిద్దరికీ సంబంధించిన ఫొటోలు ఎప్పటికప్పుడు విఘ్నేష్ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేస్తుంటాడు. 



ఇద్దరూ కలిసి తీసుకున్న కొన్ని సెల్ఫీలు ఎంతో క్యూట్ గా ఉన్నాయి.