కోపాన్ని తగ్గించుకునే మార్గాలివిగో... కోపమే అన్నింటికీ కారణం. క్షణికావేశంలో ఎన్నో అనర్థాలకు ఇదే కారణం. కోపం తగ్గించుకుంటే ఆరోగ్యానికి, జీవితానికీ కూడా మంచిది. వాదన జరుగుతున్నప్పుడు కోపంలో మాట్లాడేయకుండా కాసేపాగిపోండి. కోపం కాస్త తగ్గాక మాట్లాడితే వాదన గొడవగా మారదు. ఫ్రస్టేషన్ వచ్చినప్పుడు కోపంతో అరిచేయకుండా, ఎదుటివారికి వివరించేందుకు ప్రయత్నించండి. కోపం ఎక్కువగా వస్తున్నప్పుడు అక్కడ్నించి కాస్త దూరంగా వెళ్లిపోండి. కళ్లు మూసుకుని కాసేపు కూర్చోండి. ఒత్తిడి వల్ల కోపం పెరుగుతుంది. వేగంగా నడవడం, చిన్న చిన్న ఎక్సర్ సైజులు చేయడం వల్ల కోపం తగ్గుతుంది. కంటిన్యూగా వర్క్ చేస్తే చిరాకు, కోపం పెరుగుతాయి. మధ్యమధ్యలో బ్రేకులు తీసుకోవాలి. ముందుగా పక్కవారిని తప్పుపట్టడం మానేస్తే కోపం రాకుండా ప్రశాంతంగా ఉంటారు. పట్టరాని కోపం వస్తుంటే వైద్య సహాయం కోరవచ్చు.