ఈ భయాలు మీకున్నాయా? ఒక వస్తువు, వ్యక్తి, పని అంటే కలిగే భయాన్ని ఫోబియా అంటారు. ఈ ఫోబియాలు యాంగ్జయిటీ డిజార్డర్ కోవకే వస్తాయి. అందులో కొన్ని ఆహార సంబంధమైనవి.ఇలాంటివి మీకూ ఉన్నాయేమో చూడండి. ఆహారం అంటే కలిగే భయాన్ని సైబోఫోబియా అంటారు. కూరగాయల తినాలంటే భయపడటాన్ని లకానోఫోబియా అంటారు. చాక్లెట్ల భయాన్ని కోకోలాటో ఫోబియా అంటారు. పండ్లు తినాలంటే భయపడటాన్ని ఫ్రక్టో ఫోబియా అంటారు. వంట చేయడమంటే భయపడటాన్ని మెజైరోకాఫోబియా అంటారు. మింగడమంటే భయపడటాన్ని ఫాగో ఫోబియా అంటారు.