రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14న వీరి వివాహం ముంబైలో జరిగింది. వీరిద్దరి ఆస్తుల విలువెంతో ఇప్పుడు తెలుసుకుందాం! రణబీర్ కపూర్ ఒక్కో సినిమాకి రూ.50 కోట్లు తీసుకుంటాడు. అలియా భట్ సినిమాకి రూ.5 నుంచి రూ.8 కోట్లు తీసుకుంటుంది. ఇక అలియా ఒక్కో యాడ్ కి రూ.2 కోట్లు అందుకుంటుంది. రణబీర్ కపూర్ రూ.8 కోట్లు తీసుకుంటాడు. కానీ ఆస్తుల పరంగా అలియా నెట్ వర్త్ దాదాపు రూ.500 కోట్లు ఉంటుందట. రణబీర్ కపూర్ నెట్ వర్త్ రూ.350 కోట్లు ఉంటుందని సమాచారం. ఇద్దరి నెట్ వర్త్ కలుపుకుంటే రూ.850 కోట్లు. ఇప్పుడు బాలీవుడ్ లో అత్యధిక నెట్ వర్త్ ఉన్న జంటలల్లో వీరు కూడా ఉన్నారు.