టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది పూజాహెగ్డే. అయితే ఈ మధ్యకాలంలో ఆమెకి ఏదీ కలిసి రావడం లేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన 'రాధేశ్యామ్' డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆ తరువాత 'బీస్ట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో పూజా రోల్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఇలాంటి సినిమాలో ఆమె ఎలా ఒప్పుకుందా..? అనుకున్నారంతా. సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినా.. పూజా మాత్రం సినిమాను ప్రమోట్ చేస్తూనే ఉంది. తాజాగా ఆమె చీరలో కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ ఓ క్యాప్షన్ ఇచ్చింది. 'బ్యూటీ అండ్ ది బీస్ట్' అంటూ ఆమె ఇచ్చిన క్యాప్షన్ అదిరిపోయింది. కానీ సినిమాకి కలెక్షన్సే పెద్దగా లేవు.