అలియాభట్-రణబీర్ కపూర్ ల వివాహం ఎంతో వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఏప్రిల్ 14న రణబీర్ కపూర్ ఇల్లు బాంద్రాలోని వాస్తు బిల్డింగ్ లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వివాహం చాలా సీక్రెట్ గా జరిగింది. పెళ్లి జరిగేవరకు ఒక్క ఫొటో కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు ఫొటోలను సెట్స్ గా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పెళ్లి ఫొటోలు వైరల్ అయ్యాయి. తాజాగా మెహందీ ఈవెంట్ కి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. అలియా-రణబీర్ ల స్పెషల్ మూమెంట్స్ ను ఎంతో నీట్ గా క్యాప్చర్ చేశారు.