తెలుగులో ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసింది నటి అనిత. ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడ టీవీ సీరియల్స్ లో నటిస్తూ బిజీ అయింది. భారీ రెమ్యునరేషన్ అందుకునే టీవీ స్టార్స్ లో ఆమె కూడా ఒకరు. పెళ్లి తరువాత కాస్త జోరు తగ్గించింది. కానీ పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ డబ్బు సంపాదిస్తోంది. రీసెంట్ గా ఓ కండోమ్ యాడ్ ను ప్రమోట్ చేసి వార్తల్లో నిలిచింది. ఓ బిడ్డకు తల్లైన తరువాత కాస్త బరువు పెరిగింది అనిత. ఇప్పుడు కాస్త బరువు తగ్గానని చెబుతూ బికినీలో దర్శనమిచ్చింది ఈ బ్యూటీ. ఈ ఫొటోల్లో ఆమె చాలా హాట్ గా కనిపిస్తోంది. దీంతో ఈ బికినీ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.