అహోబిలం లక్ష్మీ నారసింహస్వామి కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ నుంచి సుమారు 25 కి.మీ దూరంలో ఉంది.
యాదాద్రి లక్ష్మీనారసింహుడు హైదరాబాద్ నుంచి 65కి.మీ దూరంలో కొండపైవెలసిన నారసింహ స్వామి
మాల్యాద్రి లక్ష్మీనారసింహస్వామి కందుకూరు-పామూరు రోడ్డు లో వలేటివారిపాలెం మండల పరిధిలో పూలమాల ఆకారంలో ఉండే కొండపై ఉంది ఈ ఆలయం.
సింహాద్రి విశాఖకి 16 కి మీ దూరంలో సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తున గల కొండ పైన వెలసిన నారసింహ క్షేత్రం ఇది వరాహ -నరసింహ మూర్తుల సమ్మేళనం లో వెలసిన ఈ స్వామి ని సింహాద్రి అని పిలుస్తారు .
ధర్మపురి లక్ష్మీ నారసింహస్వామి ధర్మపురి కి పొతే యమపురి ఉండదని చెబుతుంటారు. కరీంనగర్ కి దాదాపు 75 కి.మీ దూరంలో ఉంది ఈ క్షేత్రం.
వేదాద్రి కృష్ణా యోగా నారసింహస్వామి కృష్ణా నది ఒడ్డున చిలకల్లు కి 10 కి.మీ దూరంలో విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారి పక్క ఉంది. ఈ క్షేత్రంలో నారసింహస్వామివారు 5 అవతారాల్లో కనిపిస్తారు.
అంతర్వేది పరవళ్ళు తొక్కే గోదావరి నది మీద ప్రయాణం చేసి అంతర్వేది చేరుకోవచ్చు. ఏటా మాఘమాసంలో అంతర్వేది లక్ష్మీనారసింహస్వామి కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరుగుతుంది
మంగళగిరి పానకాల స్వామి గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంది పానకాల నారసింహస్వామి దేవాలయం, కొండ గిగువన లక్ష్మి నరసింహ స్వామి ఆలయం ఉంది.
పెంచలకోన నారసింహస్వామి నెల్లూరు జిల్లా రాపూర్ మండల కేంద్రంలో గల పెంచల కోన క్షేత్రం లో లక్ష్మి నారసింహ స్వామి స్వయంభూవుగా వెలసిన క్షేత్రం.