నేచురల్ స్టార్ నాని పారాగ్లైడింగ్ చేస్తూ వీడియో చేశారు. దీని వెనుక పెద్ద ప్లానింగ్ ఉంది.

హీరోయిన్, 'సీతా రామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఏమో సముద్రంలోకి ఇలా వెళ్లి వీడియో చేశారు. 

నాని, మృణాల్ జంటగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 13న టైటిల్ అనౌన్స్ చేశారు.

టైటిల్ వెల్లడించడంతో పాటు గ్లింప్స్ కూడా విడుదల చేయనున్నారు. ఆ విషయం చెప్పడానికే ఇలా చేశారు. 

'దసరా' విజయం తర్వాత నాని నుంచి వస్తున్న చిత్రమిది. 

హీరోగా నానికి 30వ సినిమా ఇది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న విడుదల కానుంది. 

నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న మొదటి సినిమా కూడా ఇదే

ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో మృణాల్ క్యారెక్టర్ ఏమిటో చూడాలి.

నాని 30వ సినిమాకు శౌర్యువ్‌ దర్శకుడు. మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మాతలు