పార్ట్ 2- తెలుగు సంవత్సరాల పేర్లు వాటి అర్థాలు



11. ఈశ్వర - పరమేశ్వరుడు



12. బహుధాన్య... సుభిక్షంగా ఉండటం



13. ప్రమాది... ప్రమాదమున్నవాడు అని అర్థమున్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడనవసరం లేదు



14. విక్రమ- విక్రమం కలిగిన వాడు



15. వృష- చర్మం



16. చిత్రభాను-భానుడంటే సూర్యుడు. సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించటం. చిత్రమైన ప్రకాశమంటే మంచి గుర్తింపు పొందడమని అర్థం



17. స్వభాను-స్వయం ప్రకాశానికి గుర్తు. స్వశక్తి మీద పైకెదిగేవాడని అర్థం



18. తారణ- తరింపచేయడం అంటే దాటించడం. కష్టాలు దాటించడం, గట్టెక్కించడం అని అర్థం



19. పార్థివ-పృధ్వీ సంబంధమైనది, గుర్రం అనే అర్థాలున్నాయి. భూమికున్నంత సహనం, పనిచేసేవాడని అర్థం



20. వ్యయ-ఖర్చు కావటం. ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చై ఉంటుందని ఈ సంవత్సరం అర్థం