మీ పేరు 'R' తో మొదలైందా.. అయితే మీ వ్యక్తిత్వం ఇలా ఉంటుంది…
ఎవరి పేరు అయితే 'ఆర్' అనే అక్షరం ఉంటుందో వారు ధర్మ పరులుగా ఉంటారు, చాలా శక్తివంతులు. వీరు త్వరగా స్నేహితులను సంపాదించుకోగలరు. నిజమైన విలువలు పాటిస్తారు
ఈ వ్యక్తులు డబ్బు బాగానే సంపాదిస్తారు కానీ అస్థిర మనస్తత్వం కారణంగా అనుకోకుండా నష్టపోతారు. అందుకే పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
సాధారణంగానే అధికారాన్ని చెలాయించే తత్వం వీరిలో ఉంటుంది. చాలా తక్కువ సమయంలోనే ఇతరుల పై ప్రభావం చూపగలరు.
ఎంత కొత్తవారితో అయినా చాలా సులభంగా కలసిపోతారు. వీరిని అర్ధం చేసుకోవడం అంత సులభం కాదు. ఈ కారణం వల్లే నమ్మకానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతుంటాయి.
చూడటానికి వీరు అర్ధంకానట్టు కనిపిస్తారు..అందుకే చాలా పుకార్లకు వీరే కారణం అనిపించుకుంటారు, చేయని తప్పులకు కూడా కొన్నిసార్లు బాధితులుగా మారుతారు
ముక్కు సూటిగా, మనస్సులో ఏది దాచుకోకుండా మాట్లాడేస్తుంటారు.
మంచి మాటకారులు, వక్తలుగా పేరుతెచ్చుకుంటారు
విశ్వాసం, కారుణ్య స్వభావం, ప్రేమపూరితమైన స్వభావం వీరి సొంతం
ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు సహజంగానే తెలివైన వాళ్లు. అందుకే తక్కువ సమయంలోనే ఎంత కష్టమైన సందర్భాన్ని అయినా అర్థం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
వీళ్లపై ఇతరులు మరీ ఎక్కువ అధికారాన్ని ప్రదర్శించలేరు.. ఓ మోస్తరు అధికారం ప్రదర్శన వరకూ వీరు సరే అంటారు కానీ పరిధి దాటే అవకాశం అస్సలివ్వరు.
సందర్భాన్ని బట్టి వారిని వారు మలుచుకునే ప్రయత్నం చేస్తారు