N అక్షరంలో పేరు పెట్టుకున్న వారిలో పాజిటివ్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. వీళ్లు కార్యసాధకులు. ఏదైనా పని చేయాలి అనుకుంటే కాస్త ఆలస్యమైనా చేసితీరుతారు. ఇతరులను తమవైపు తిప్పుకునేలా ఒప్పించగలరు.
వీళ్లు స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉంటారు. అతివినయం అస్సలు ప్రదర్శించరు...వీరు ఎదుటివారికి ఇచ్చే గౌరవం మర్యాద , ప్రదర్శించే వినయం సాదాసీదాగా ఉంటుంది.
వీరికి సొంత ఆలోచనలు ఉంటాయి, స్వతంత్ర భావాలెక్కువ..ఎదుటి వారు అభిప్రాయాలు రుద్దాలని ప్రయత్నించినా వీరు తలొంచరు...
చెప్పుడు మాటలు అస్సలు వినరు, ఒకవేళ ఎవరైనా చెప్పినా వాటిని విని వదిలేస్తారు కానీ వాటిని నమ్మి, పరిగణలోకి తీసుకునే స్వభావం కాదు
ఎవ్వరితోనూ తొందరగా స్నేహం చేయరు..చేస్తే మాత్రం జీవితాంతం ఆ స్నేహం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు.
ప్రతి అంశంపై సొంత ఆలోచనలు, స్వతంత్ర భావాలు ఉంటాయి. ఇతరుల మాట వినకుండా తమదైన శైలిలో రాణిస్తారు. అమ్మాయిలు తొందరగా ఎవ్వరితో స్నేహం చేయడానికి ఇష్టపడరు. చేస్తే మాత్రం జీవితాంతం వరకు స్నేహం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు.
జీవితంలో ఎదుర్కొనే ఒడిదొడుకుల కారణంగా వీరు బలవంతులుగా, శక్తిమంతులుగా మారిపోతారు.