నెయిల్ పాలిష్ వేయడం అనేది ఓ ఆర్ట్. దీనిని ఎలా పడితే అలావేస్తే అస్సలు బాగోదు.

గోళ్లకు రంగువేసే పద్ధతి బాగుంటే మీ చేతులు మరింత అందంగా మారుతాయి.

నెయిల్ పాలిష్ వేసే ముందు గోళ్లకు బేస్​ కోట్ వేయాలి.

ఇది మీ గోళ్లను రక్షించడమే కాకుండా.. రంగు ఎక్కువ రోజులు ఉండేలా చేస్తుంది.

గోళ్లరంగు సీసా తెరవక ముందే దానిని బాగా షేక్ చేయండి.

లేదంటే నెయిల్ పాలిష్ ముద్దలుగా మారి.. గోళ్ల అందాన్ని మార్చేస్తాయి.

గోళ్ల రంగును ఒకే స్ట్రోక్​లో వేయొద్దు. మూడు నాలుగు స్ట్రోక్​లు పెయింట్ చేయండి.

ఫైనల్​గా సన్నని లేయర్​ను టాప్​కోట్​గా వేయండి. (Image Source : Pixabay)