యువ హీరో నాగశౌర్య త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ఆయనకు కాబోయే భార్య ఎవరో తెలుసా? నాగశౌర్య పెళ్లి చేసుకోబోయేది ఈ అమ్మాయినే. ఈమె పేరు అనూష శెట్టి. అనూష శెట్టి ఇంటీరియర్ డిజైనర్. పలు ప్రముఖ కంపెనీలకు పని చేశారు. అనూష శెట్టి ఆర్కిటెక్‌గా కర్ణాటక స్టేట్ అవార్డు అందుకున్నారు. మంగుళూరు దగ్గరలోని కుందాపూర్ ఆవిడ స్వస్థలం. అనూష శెట్టి ఊరు, ఎన్టీఆర్ తల్లి షాలిని ఊరు ఒక్కటే కావడం గమనార్హం. నాగశౌర్య, అనూష శెట్టిలకు బెంగళూరులో పరిచయమైంది. అది ప్రేమగా మారింది. శౌర్య ప్రేమకు తల్లిదండ్రులు శంకర్, ఉష గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనూష పేరెంట్స్ కూడా ఎస్ చెప్పారు. ఇటు శౌర్య, అటు అనూష పేరెంట్స్ ఓకే చెప్పడంతో హ్యాపీగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. బెంగళూరులో ఈ నెల 19న మెహందీ ఫంక్షన్, 20న నాగశౌర్య - అనూష పెళ్లి జరగనుంది. నాగశౌర్య పెళ్లి విషయం తెలియడంతో ఆయనకు పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు.