అప్పుడు కౌశల్, ఇప్పుడు ఇనయా - కార్నర్ చేస్తే కప్ కొట్టేస్తారు! ‘బిగ్ బాస్’ సీజన్ 2 చూసినవారికి కౌశల్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ముక్కు సూటిగా మాట్లాడటం వల్ల హౌస్‌మేట్స్ కౌశల్‌ను టార్గెట్ చేసుకునేవారు. దీంతో అంతా కౌశల్‌ను కార్నర్ చేశారు. ఎవరి సపోర్ట్ లేకుండా కౌశల్ ఒంటరి పోరాటం చేశాడు. అదే, కౌశల్‌కు కలిసి వచ్చింది. సింపథీ క్రియేట్ చేసింది. ‘బిగ్ బాస్’కు విన్నర్‌ను చేసింది. ‘బిగ్ బాస్’ సీజన్-6లో ఇనయాను చూస్తుంటే అదే అనిపిస్తోంది. ఇనయా కూడా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. దీంతో తోటి హౌస్‌మేట్స్‌కు ఆమె నచ్చడం లేదు. ప్రతీ విషయాన్ని తెగేదాకా లాగుతుందనే కారణంతో అంతా ఆమెను కార్నర్ చేశారు. ప్రతి వారం నామినేషన్లో ఇనయా ఉంటుంది. కానీ, ఆడియన్స్ సేవ్ చేస్తున్నారు. వాస్తవానికి రేవంత్, బాలాదిత్య, శ్రీహాన్‌లో ఒకరు విన్నర్ అవుతారని మొదట్లో అంతా భావించారు. కానీ, ఇప్పుడు వారికి ఇనయా గట్టి పోటీ ఇస్తోంది. ఓటింగ్స్‌లో దూసుకెళ్తోంది. ఇనయాకు రామ్ గోపాల్ వర్మ అభిమానుల అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయి. Images Credit: Star Maa/Disney Hotstar and Instagram