నటుడు అభిజీత్.. టైం దొరికితే చాలు కొండలు, కోనల వెంట పరిగెడుతుంటాడు.

అడవుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు.

తాజాగా ఫారెస్ట్ లో ఒంటరిగా సినిమాలు చూస్తూ టైంపాస్ చేస్తున్న ఫోటోలను షేర్ చేశాడు.

నటుడు అభిజీత్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.

తొలి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఆ తర్వాత తనకు ఎలాంటి సినిమా అవకాశాలు రాలేదు.

బిగ్ బాస్-4 సీజన్ లో పాల్గొని టైటిల్ నెగ్గినా ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్క ఛాన్స్ రాలేదు.

అయినా, నిరాశ చెందకుండా లాంగ్ జర్నీలు చేస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.

Photos Credit: Ahijeet/Instagram