‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో అందరి మనసులూ దోచేసింది నభా నటేష్. ‘నన్ను దోచుకుందువటే’లో నభా తన అభినయంతో ఆకట్టుకుంది. ‘నన్ను దోచుకుందువటే’ తర్వాత నభాకు అవకాశాలు క్యూ కట్టాయి. ‘అదుగో’ సినిమా నిరాశ పరిచినా, ‘ఇస్మార్ట్ శంకర్’ ఆదుకున్నాడు. ‘ఇస్మార్ట్ శంకర్’లో నభా అందాల ఆరబోతను చూసి అబ్బో అన్నారంతా. ఆ తర్వాత వచ్చిన ‘డిస్కో రాజా’, ‘అల్లుడు అదుర్స్’ ఆమెకు కలిసి రాలేదు. అయితే, ‘సోలో బతుకే సో బెటర్’ సినిమా మాత్రం నభాకు ఊరటనిచ్చింది. ‘మ్యాస్ట్రో’ ఫ్లాప్‌తో నభాకు మళ్లీ అవకాశాలు రాలేదు. అవకాశాల కోసం నభా ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా నభా నటేష్ చీరతో ఉన్న వీడియోను పోస్ట్ చేసింది. Credits: Nabha Natesh/Deepak Durai/Instagram