ప్రోటీన్ తో నిండి ఉన్న గుడ్డు పోషకాల ఘనిలాంటిది. కానీ దీని గురించి కొన్ని అపోహలు ఉన్నాయి.



ప్రతిరోజూ గుడ్డు తినకూడదు- అపోహ



వాస్తవం- గుడ్లు అత్యంత పోషకమైన ఆహారం. ప్రతిరోజూ తినడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్లు, మినరల్స్ అందుతాయి.



గోధుమ రంగు గుడ్లు తెల్ల వాటి కంటే ఆరోగ్యకరమైనవి- అపోహ



గోధుమ, తెలుపు రంగు గుడ్లు రెండూ ఒకే రకమైన పోషకాలు కలిగి ఉంటాయి. ఒకే విధమైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి.



గుడ్డు పచ్చ సొన తింటే బరువు పెరుగుతారు- అపోహ



వాస్తవం- గుడ్డులోని తెల్ల సొన కంటే పచ్చ సొన ఎక్కువ కేలరీలు కలిగి ఉంటుంది.
అతిగా తినాలనే కోరికని తగ్గిస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి.


గుడ్డు కొలెస్ట్రాల్ స్థాయిలని పెంచుతుంది- అపోహ



గుడ్డులోని కొలెస్ట్రాల్ రక్త కొలెస్ట్రాల్ పై తక్కువ ప్రభావాన్ని చూపుతుందని ఇటీవల అధ్యయనం వెల్లడించింది.-
వాస్తవం


గుడ్లు కడిగి తినాలి లేదంటే దాని మీద బ్యాక్టీరియా ఉంటుంది- అపోహ



వాస్తవం- గుడ్లు కడగకూడదు. గుడ్డు పెంకుపై ఉండే సహజ రక్షణ పూత తొలగిపోతుంది.
బ్యాక్టీరియా చంపాలని అనుకుంటే వాటిని ఉడికించాలి.


వేసవిలో గుడ్లు తినకూడదు- అపోహ



వాస్తవం- సీజన్ తో సంబంధం లేకుండా గుడ్లు ఎప్పుడైనా తినొచ్చు.