టేస్టీ మటన్ దోశ... తింటే వదలరు

మటన్ కీమా - పావు కిలో
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
గుడ్లు - నాలుగు
పసుపు - ఒక స్పూను
మిరియాల పొడి - ఒక స్పూను

నూనె - సరిపడినంత
దోశె పిండి - అరకిలో
మసాలా పొడి - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
ఉల్లిపాయ - ఒకటి

కళాయిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు వేసి వేయించాలి.

తరువాత మటన్ కీమా, ఉప్పు, మసాలా పొడి వేసి బాగా వేయించి, పక్కన పెట్టుకోవాలి.

గుడ్లు కొట్టి గిన్నెలో వేయాలి. ఇప్పుడు పెనం వేడెక్కాక దోశె పిండితో దోశె వేయాలి.

పైన గుడ్లు సొన దోశ అంతా పరచాలి.

పైన మటన్ కీమా వేపుడును వేయాలి.

దోశె కాలాక మటన్ దోశెను సర్వ్ చేయాలి.