మాట్లాడటం ఓ కళ. అది అందరికీ చేతకాదు. అయితే మీరు ఎంత బాగా మాట్లాడేవారైనా సరే రోజుకో గంట సైలంట్‌గా ఉండండి. ఇలా సైలెంట్‌గా ఉండడం వల్ల మానసిక, శారీరక ప్రయోజనాలు ఉంటాయట. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, భయం వంటి వాటి నుంచి మీరు రిలీఫ్ పొందవచ్చు. ఒత్తిడి వల్ల కలిగే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. రోజూ ఓ గంట సైలంట్‌గా ఉంటే గుండె సమస్యల ముప్పు తగ్గుతుందట. శరీరానికి మెరుగైన రక్తప్రసరణ అందుతుందని నిపుణులు చెప్తున్నారు. క్రియేటివిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగవుతాయట. రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు బీపీ కంట్రోల్లో ఉంటుందట. (Image Source : Pexels)