చలికాలంలో బెల్లం తినడం వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. బెల్లం జీవక్రియను వేగవంతం చేస్తుంది..కడుపుని శుభ్రపరుస్తుంది. జలుబు, దగ్గు వంటి వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బెల్లం యాంటీ ఇన్ ఫ్లమేటరీ. ఇది కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. బెల్లంలో పొటాషియం ఉంటుంది. ఇది హైబీపీ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. బెల్లంలో శరీరానికి శక్తి నిచ్చే ఐరన్ ను కలిగి ఉంటుంది. బెల్లంలో మెగ్నీషియం ఉంటుంది. ఇది చలికాలంలో మీ రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. బెల్లం తింటే మలబద్ధకం సమస్యే ఉండదు. ఈ కారణాలన్నింటికీ శీతాకాలంలో నిద్రపోయే ముందు ఖచ్చితంగా బెల్లం తినండి.