అమ్మాయిలు ఎదుర్కునే సమస్యల్లో పీరియడ్స్ ఒకటి. ఎందుకంటే ఇవి ఎప్పుడు వస్తాయో.. ఎప్పుడు రావో ఎవరూ చెప్పలేము. ఆహారం, ఒత్తిడి, హర్మోన్లు ఇలా ఒకటా రెండా అన్ని పీరియడ్స్‌పై ప్రభావం చూపిస్తాయి. దీర్ఘకాలంగా ఈ సమస్య బాధిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో పీరియడ్స్ రెగ్యూలర్ వచ్చేలా ట్రై చేయవచ్చు. అల్లం టీ శరీరంలో వేడిని ఉత్పత్తి చేసి.. పీరియడ్స్ వచ్చేలా చేస్తుంది. బొప్పాయిని డైట్లో చేర్చుకోవడం వల్ల కూడా పీరియడ్స్ వస్తాయి. గుడ్డులోని పచ్చసొన, బెల్లం వంటి పదార్థాలు కూడా పీరియడ్స్‌ను ప్రేరేపిస్తాయి. (Image credit : Pexels, Pinterest)