ఆవ నూనెను ఎన్నో ఏళ్లుగా జుట్టు సంరక్షణ, పెరుగుదల కోసం ఉపయోగిస్తున్నారు. దీని వాసన, చిక్కదనం వల్ల కొందరు దీనిని ఉపయోగించేందుకు ఇష్టపడరు. కానీ దీనిని జుట్టుకి అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు. ఆవ నూనెలోని బీటా కెరోటిన్ జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు స్కాల్ప్‌పై ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. జుట్టుకి మంచి పోషణ అందించి.. జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ జుట్టు మెరవడాన్ని దూరం చేస్తాయి. చుండ్రు సమస్యలను దూరం చేసి జుట్టుకు పెరుగుదలను అందిస్తాయి. (Images Source : Unsplash)