సూర్య పీరియాడిక్ సినిమా ‘కంగువా’ మినీ రివ్యూ - అదరగొట్టిందా? సూర్య నటించిన ‘కంగువా’ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో సూర్య ఆదివాసీ తెగల నాయకుడిగా కనిపించారు. పులావా అనే బాలుడు, కంగువా అనే యోధుడు జన్మ జన్మల పాటు చేసే ఎమోషనల్ జర్నీనే ‘కంగువా’ కథ. ‘కంగువా’ ఫస్టాఫ్ చాలా చప్పగా ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా రెడిన్, యోగి బాబు, దిశా పటానీల సీన్లు ఒక్కటి కూడా ఆకట్టుకోవు. ఈ ఎపిసోడ్‌పై ఆడియన్స్‌కు విసుగు వచ్చేస్తుంది. దిశా పటాని లవ్ ట్రాక్ కథకు అవసరం కూడా లేదు. కానీ పీరియాడిక్ పోర్షన్ మాత్రం ఇంప్రెస్ చేస్తుంది. వార్ సీన్లు, ఎమోషనల్ సీన్లు... ఇలా అన్నీ వర్కవుట్ అయ్యాయి. ఒక స్టార్ హీరో క్యామియో ద్వారా సెకండాఫ్‌కు ఇచ్చిన లీడ్ బాగుంటుంది. అలాగే ఈ లీడ్ అయ్యాక చివర్లో వచ్చే ఒక షాట్ సెకండాఫ్‌పై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఏబీపీ దేశం రేటింగ్: 2.75/5.