ఆయుర్వేదంలో ఆరోగ్యానికి ఆహారం ప్రధానం.

పోషకాహారం తీసుకోవడం ద్వారా శరీరంలోని త్రిదోషాల నిర్వహణ సాధ్యపడుతుంది.

మినపప్పు వంటివి త్వరగా అరగవు. కానీ పెసరపప్పు త్వరగా జీర్ణం అవుతుంది. తినే సమయంలో ఆహార స్వభావాన్ని అనుసరించి తీసుకోవాలి.

గ్యాస్ స్టవ్ మీద వండిన వంటకు, ఓవెన్ లో చేసిన పదార్థానికి రుచిలో కచ్చితంగా తేడా ఉంటుంది. ఆహారం ఎలా తయారైందనేది కూడా ముఖ్యమే.

రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆహారపదార్థాలను కలిపి తీసుకోవద్దు, పాలతో కలిపి బనానషేక్, మ్యాంగో షేక్ వంటివి విరుద్ధ ఆహారాలు.

ఇలాంటి విరుద్ధ పదార్థాలు కలిపి చేసిన ఆహారాలు టాక్సిన్లను ఉత్పత్తి చేస్తాయి.

కడుపు నిండేందుకు కాస్త ముందే తినడం ఆపెయ్యాలి. ఎంత తింటున్నామనేది చాలా ముఖ్యం.

నాణ్యమైన దినుసులను ఉపయోగించి చేసే ఆహారమే తీసుకోవాలి.

సకాలంలో భోంచెయ్యడం చాలా ముఖ్యం. ఆకలిగా ఉన్నపుడు మాత్రమే భోంచెయ్యాలి.

భోజన సమయంలో టీవి చూడడం, చదవడం, ఫోన్ వాడడం, మాట్లాడడం, నవ్వడం చెయ్యకూడదు.

చాలా త్వరత్వరగా లేదా అతినెమ్మదిగా ఆహారం భోజనం పూర్తిచెయ్యొద్దు.
Representational Image : Pexels