మన జీవన శైలి వల్ల రకరకాల అనారోగ్యాలు వస్తున్నాయి. అందులో అసిడిటి కూడా ఒకటి.

నిరంతరాయంగా కొనసాగే ఒత్తిడి, అస్థిర జీవన శైలి వంటివన్నీ దీనికి కారణం.

హైపర్ అసిడిటికి ఆయుర్వేద నిపుణులు కొన్ని సహజ ఆహారాలు సూచించారు వాటి గురించి తెలుసుకుందాం.



ధన్యక్ హిమ అంటే ధనియాలని అర్థం. ఇవి శరీరంలో పిత్త, ఆమ్ల స్థాయిలు పెరగకుండా నివారిస్తాయి.

రాత్రంతా కప్పు నీటిలో ధనియాలు నానబెట్టి పొద్దున్నే వడకట్టి ఆనీటిని తాగాలి.

ధనియాలు అపానవాయువు, కడుపుబ్బరాన్ని కూడా తగ్గిస్తాయి.

సోంపులో ఉండే ఖనిజలవణాలు, ఫైబర్ అసిడిటీ, హైపర్ అసిడిటిని నియంత్రించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

అరస్పూన్ సోంపు గింజలకు అరస్పూన్ పటికబెల్లం కలిపి రోజూ భోజనం తర్వాత తీసుకోవాలి.

సోంపులో ఉండే యాంటీ అల్సరస్ లక్షణాలు జీర్ణాశయ లైనింగ్ ను చల్లబరుస్తాయి.

నల్లని ఎండు ద్రాక్షలో మెగ్నిషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.

నల్ల ద్రాక్షతో జీర్ణక్రియ మెరుగవుతుంది. ఫలితంగా అపిడిటి, హైపర్ అసిడిటి నుంచి ఉపశమనం దొరుకుతుంది.

పరగడుపున ధనియాల నీళ్లు తాగిన తర్వాత 10 నల్ల ఎండు ద్రాక్షలు తింటే మంచి ఫలితాలు ఉంటాయి.

Representational Image : Pexels