యాపిల్, పండు కాదు యముడు - ఆరోగ్యం హాంఫట్?

రోజుకో యాపిల్ తింటే డాక్టర్‌తో పనే ఉండదని అంటారు. కానీ, అదంతా ఒకప్పుడు.

ఎందుకంటే, యాపిల్ అందరికీ మంచిది కాదట. ఆ పండు వల్ల కొందరికి అలర్జీలు వస్తాయట.

యాపిల్ అతిగా తిన్నా అనార్థమేనట. రోజుకు ఒక యాపిల్ తింటేనే ఆరోగ్యకరం. ఎక్కువ తింటే ప్రమాదం.

ఎందుకంటే యాపిల్‌లో ఫైబర్ ఎక్కువ. యాపిల్ అతిగా తింటే ఫైబర్ స్థాయిలు పెరుగుతాయి.

ఫైబర్ ఎక్కువైతే ఉబ్బరం, మలబద్ధకం సమస్యలు ఏర్పడతాయి.

యాపిల్స్‌లో కార్బోహైడ్రేట్‌లు ఎక్కువ. యాపిల్స్ అతిగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

కాబట్టి, డయాబెటిక్ బాధితులు ఒకటి కంటే ఎక్కువ యాపిల్ పండ్లను తినకూడదు.

అత్యధిక పురుగు మందుల అవశేషాలు కలిగిన పండ్ల జాబితాలో యాపిల్స్ అగ్రస్థానంలో ఉన్నాయట.

యాపిల్‌లో డైఫెనిలామైన్ అనే క్రిమిసంహారకం ఉంటుంది. అందుకే బాగా శుభ్రం చేసుకుని తినాలి.

యాపిల్‌లో పిండి పదార్థాలు ఎక్కువ. మీరు వాటిని అతిగా తింటే బరువు పెరిగే అవకాశాలున్నాయ్.

యాపిల్స్‌లో ఆమ్లాలు దంతాలను దెబ్బతీస్తాయి. యాపిల్ ముక్కలు పళ్లలో ఇరుక్కుంటే శుభ్రం చేసుకోవాలి.

Images Credit: Pixabay and Pexels