నిత్యం కంప్యూటర్, టీవీల ముందు కూర్చునే మనం కళ్లకు రెస్ట్ ఇవ్వాలి.

కంటి చూపు మెరుగుపడేందుకు ఈ సింపుల్ వ్యాయామాలను చేస్తే చాలు.

రెండు అరచేతులతో మూసిన కళ్లను 2 సెకన్లు నొక్కండి.

మీ చేతిని ముందుకు చాచి బొటనవేలుపై 15 సెకన్లు ఫోకస్ పెట్టండి.

మీకు దూరంగా ఉన్న వస్తువుపై ఏదైనా అక్షరం రాసి దాన్ని ఏకాగ్రతతో 20 సెకన్లు చూడండి.

కనుగుడ్లను కొన్ని సెకన్లపాటు కుడి, ఎడమ వైపుకు, గుండ్రంగా తిప్పండి.

ఒక పెన్సిల్ తీసుకుని దాని కొనను చూస్తూ ముక్కు వరకు తీసుకురండి. కొన్ని సెకన్లు రిపీట్ చేయాలి.

కొన్ని సెకన్లపాటు రెప్పలు వేస్తూ తెరవడం కూడా మంచి వ్యాయామం.

Images and Videos Credit: Pexels